సాగులో కష్టాలు - వ్యవసాయ వార్తలు - కవిత్వం - సంగీతం

ఇది ఒక వ్యవసాయ అధికారి బ్లాగు. అందరు బ్లాగ్ చేయొచ్చు.

Friday, November 1, 2013

దీపావళి శుభాకాంక్షలతో ...


దీపావళి శుభాకాంక్షలతో ...
నరకుని గర్వము నణచగ
నరవరుని సతి సత్యభామ నతిశయమ్ముగా
సరసర దునుమాడె ఖలున్
సరళిగ రవ్వలు చిందగ శరఘాతముతో !
పెద్దలు పిన్నలు గూడిరి
సద్దులు జేయుచు గాల్చిరి సరముల వడిగా !
హద్దులెరుగనా(నందము
కద్దను వారెవరు యిలను, కానగ గలరా !
 దివిన వెలిగె దివ్వెలు
నవి కాంతులు నింపెనవని నతిశోభనమున్ !
రవి చంద్రులు కూడినట్లు
భువిని దివాళి జరిపిరి బుధులు ప్రీతిగాన్ !

01-11-2013                                                      ...శనగల

Tuesday, October 29, 2013

వరద కష్టాలు

వరద కష్టాలు

కనరాడు దినకరుడు
దినమె రేయిగ దోచె; నడిసంద్రములలో
జనవాసములలో జడి
వాన కురిసె, యలజడి వుప్పెనెగసే !
చెరువుల తలపించినవే
గరువున వేసిన పంటలు, గుండె పగులగా!
బరువగు సేద్యము, తధ్యము
కరువున నిను గాచుదెవరు కర్షక మిత్రా !
కరువులు వానలు వరదల
వెరువక కర్షక మిత్రులు వరి వేయుదురే
మరువక సాయము చేయుట
వరులకు భూసురులకు యది శోభనమేగా !
తడిసెను బియ్యము పప్పులు
తడియారదె కంట నీరు; తగ్గని వెతలే !
గుడిసెల జీవుల తిప్పలు
గుడిలో దేవుని కెరుకే కనుమా రామా !

జడివానల చేటుబడి
నడిసంద్రపు నావాయె జన జీవనమే
కడివెడు వెతలను దీర్చని
మడిగట్టిన యీ నేతల మరువుము సుమ్మీ !
తప్పవు వర్షపు తిప్పలు
తెప్పలు గొని తెచ్చుకున్న తీరున తంటా !
గొప్పలు చెప్పక నేతలు
చప్పున సాయము జేసిన చెల్లును వినరా !


27-10-2013                                                                  …… శనగల

Wednesday, October 2, 2013

గాంధి తిరిగి పుట్టినా బట్ట తిరిగి కట్టునా? కనుగొని యీ గాంధియిజం ? !

గాంధీఇజమా
ఛెళ్ళున చెంపలు పగులని
భళ్ళున రోడ్డునకీడ్చిన బలవంతముగన్
వెళ్ళుము చెల్లును దన్నుట
గళ్ళను బట్టుట నేడది గాంధియిజముగా !
రాముడు కాయడు జనులర
హీము కనిన యూరకొనును హతవిధి విధీ !
దేముడు యోహను జూడడు
యేముని మార్చగజాలరు యీగడ్సెయిజమున్ !
ఖద్దరు చొక్కాల వెనుక
ఖాకీ చెప్పుల క్రింద కనుగొను గాంధియిజం ? !
అరాచకీయ రాజకీయ
కామాంధుల చేతులలో కనుగొను గాంధియిజం ? !
అంగడి సరుకుగ న్యాయం
విక్రయించు వీధులలో కనుగొను గాంధియిజం ? !
నోట్లకు వోట్లను కొనుటకు
కోట్లు కూడబెట్టుటలో కనుగొను గాంధియిజం ? !
గాంధి తిరిగి పుట్టినా

బట్ట తిరిగి కట్టునా? కనుగొని యీ గాంధియిజం ? !                                                ...శనగల

Tuesday, September 17, 2013

ఆంధ్రమాతా దండకం
         శ్రీ ఆంధ్ర మాతా, నమో ఆంధ్ర మాతా, నమో తెలుగుతల్లి, తెలుగు తేజంబు నలుదిశల చాటించినావే, కీర్తి ఖంఢాంతరాన ప్రకాశింపగా చేసినావే, భాషా ప్రయుక్త రాష్ట్రంబుగా ఎదిగి,  అంధ్రన్, తెలంగానన్ సీమ ప్రాంతంబులన్ సమదృష్టిగా జూచినావే, దయాశీలివే, ధర్మమున్ నాల్గు పాదాల నడిపించినావే, అన్ని జిల్లాల  అభివృద్ధి గావించినావే, నీ కీర్తినేనెంచ నేనెంతవాడన్, కరుణించి కాపాడవే తల్లి,  బాధలన్ దీర్పవే, బందులన్ ఆపవే, నీ భజన నే సేతునే… విభజనల్ ఆపవే, సమైక్యంబుగా రాష్ట్రమున్ నిలపవే, ఓ భారతీ పుత్రి, సదా నీవె సమవర్తి, తెలంగాన నేతలకు సద్భుద్ధి ప్రసాదింపవె, మనసులన్ మార్చవె, మనుషులన్ జేయవె, కలసివుంటేనె కలదు సుఖంబను నీతి బోధింపవె, సద్భుద్ది కలిగించవె,కనక దుర్గమ్మవె, కాళికామాతవే, మహంకాళివే, మారి మరిడెమ్మవే…నీకు పొంగళ్ళు నే సేతు, బోనాలు నే ఇత్తు,మొక్కులన్ దీర్తునే, కోర్కెలన్ దీర్పవే.. దయామూర్తివే, మమ్ములన్ గావవే !
సోనియా మాయ మటుమాయగా చేయవే,మన్మోహనున్ మనసునున్ మార్చవే, కేసియారున్ నిరోధించవే, కేటియార్ నోరు మూయించవే, ఈటెలకు నోరు కుట్టేయవే, కోదండరామున్ కట్టిపడవెయ్యవే, తోక పార్టీలకున్ తెలివితేటల్  ప్రసాదింపవే, ఉస్మానియా మానియా లోకమున్ మార్చవే... కళ్ళు తెరిపించవే, సమైక్యాంధ్ర మంత్రమ్ము బోధించవే...సదా నిన్ను స్మరియింతు, సదా పూజలున్ చేతునే...మొరాలింపవే...నమస్తే ఆంధ్ర మాతా..నమస్తే..నమస్తే నమః ! 
11-09-2013                                                                                          ...శనగల
   
తెలంగాణ లొల్లిపాట
ఇటలీ తిరగేసి చూడు
విభజన మంత్రం పాడు
బ్రిటీషోడి నీతి సూక్తి
సోనియాకు అనురక్తి !
తమిళ తంబి పుల్లబెట్టె
తెళంగాణ వెర్రిపుట్టె
కేసిఆర్ నిప్పుపెట్టె
సెంటర్లో వణుకు పుట్టె !
ఆంధ్రను విడతీయబోతె
ఎన్నికల్లొ అధోగతె
డిపాజిట్లు దక్కవంట
సచివులు మాజీలంట !
బి.జె.పి. వోట్ల వేట
టి.ఆర్.ఎస్. లొల్లిపాట
టి.డి.పి.(కల్ల) బొల్లిమాట
కాంగ్రెస్సుది అమ్మబాట!



(కో)దండ(గ)రాముని కంపెనీ
కదిలిస్తే కంపని
అడుసులొ అడుగేస్తినని
ప్రక్షాలన తప్పదనీ 
అమ్మకు చెవిలో చెప్పర డిగ్గీరాజన్న!
తెలంగాణ తమ్ముడా
తెలుగుతల్లి బిడ్డడా
విడిపోతె పరాజయం
కలిసుంటె మన విజయం !
రాజకీయమా అవకాశవాదమా
ప్రజలకోసమా పదవికోసమా
తెలంగాణమా సమైక్యవాదమా
మసలుకొనుము తెలివిగా
మేలుకొనుమ మిత్రమా!
                                                       ­­..… శనగల




Saturday, October 13, 2012

Thursday, October 11, 2012

Wednesday, October 10, 2012


జీఎం విత్తనం.. అశాస్త్రీయం
డీడీఎస్ మీడియా భేటీలో కేరళ
జీవ వైవిద్య బోర్డు మాజీ చైర్మన్ విజయన్

హైదరాబాద్, అక్టోబర్ 9 : ఆహార పంటల్లో జన్యుమార్పిడి పూర్తిగా అశాస్త్రీయమని కేరళ బయోడైవర్సిటీ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ వీఎస్ విజయన్ అభిప్రాయపడ్డారు. బీటీ సాగు కంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని, పెట్టుబడి కూడా దాని కంటే తక్కువని ఆయన పేర్కొన్నారు. పంటలను నాశనం చేసే పురుగులను నియంత్రించేందుకే బీటీ సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. జీఎం పంటలపై డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయన్ పాల్గొన్నారు. 


ఆయనతోపాటు.. వనగం ఫౌండేషన్ చైర్మన్ నమ్మాళ్వార్, డీడీఎస్ డైరెక్టర్ సతీష్, రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు గ్రహీత ఫ్రాన్సిస్ మూర్, బెనిన్ దేశానికి చెందిన రానే సేజ్‌బూ, జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ ఇస్లే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 75 శాతం బీటీ పంటలు వేసి నష్టపోయినవారేనని విజయన్ అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఆహార పంటల్లో విడుదల చేయడానికి 72 రకాల జీఎం విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసుకుని ఉన్నాయన్నారు. 



జీఎం పంటల పుప్పొడి.. తేనెటీగలు, తుమ్మెదలు, గాలి ద్వారా నాన్ జీఎం పువ్వులపై పడితే సంకరం జరిగి జీవ వైవిధ్యానికి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జన్యుమార్పిడి చేసిన ఆహార పంటల క్షేత్ర ప్రయోగాలను సైతం అనుమతించకూడదన్నారు. బీటీ పంటలతో భారత ఆహార సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ముప్పు పొంచి ఉందని డీడీఎస్ డైరెక్టర్ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత తృణధాన్య పంటల సాగును బీటీ పత్తి తగ్గించి వేస్తోందని నమ్మాళ్వార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. దేశంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరగడం వెనుక విదేశీ కంపెనీల హస్తం ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.

Tuesday, October 9, 2012




                                           
                                              









భలే  మ౦చి  ఉగాది ....
తీపి  పులుపు  చేదిది ...     // భలే //
శడ్రుచులు  చేరినది ...
న౦దనమీ  ఉగాది ...         // భలే //
తెలుగు  జాతి  వేదమిది ...
తెలుగువాడి  సారమది...
తెలుగునాట  నాదమది...
తెలుగు  భాస  సప్తపది...   // భలే //
పల్లె బతుకు పునాది ...
పాడి ...ప౦టల  సవ్వడి ...
స౦బరాల  కాలమిది ...
శుభ౦  పలుకు  ఉగాది .. . // భలే //
వ్యవసాయక  దేశమిది ...
రెతుబాట  మనవిధి ....
పల్లెనిద్ర  ప్రగతిపది ...
పాడిప౦ట  సమ్రుద్ధి...  // భలే //
This song was written on the occasion of Ugadi festival of 2012. The Telugu software i have i.e., Baraha did not support to write SHA in Telugu or i could not correctly find the keys, so in the line numbers 3 and 8 i could not use proper letters. Similarly in the 14th line RY could not be written. Veiwers please make a note.