ఆంధ్రమాతా దండకం
శ్రీ ఆంధ్ర మాతా, నమో ఆంధ్ర మాతా, నమో తెలుగుతల్లి, తెలుగు తేజంబు
నలుదిశల చాటించినావే, కీర్తి ఖంఢాంతరాన
ప్రకాశింపగా చేసినావే, భాషా ప్రయుక్త
రాష్ట్రంబుగా ఎదిగి, అంధ్రన్, తెలంగానన్ సీమ ప్రాంతంబులన్ సమదృష్టిగా
జూచినావే, దయాశీలివే, ధర్మమున్ నాల్గు
పాదాల నడిపించినావే, అన్ని
జిల్లాల అభివృద్ధి గావించినావే, నీ కీర్తినేనెంచ
నేనెంతవాడన్, కరుణించి కాపాడవే
తల్లి, బాధలన్ దీర్పవే, బందులన్ ఆపవే, నీ భజన నే సేతునే… విభజనల్ ఆపవే, సమైక్యంబుగా
రాష్ట్రమున్ నిలపవే, ఓ భారతీ పుత్రి, సదా నీవె సమవర్తి, తెలంగాన నేతలకు
సద్భుద్ధి ప్రసాదింపవె, మనసులన్ మార్చవె, మనుషులన్ జేయవె, కలసివుంటేనె కలదు
సుఖంబను నీతి బోధింపవె, సద్భుద్ది
కలిగించవె,కనక దుర్గమ్మవె, కాళికామాతవే, మహంకాళివే, మారి మరిడెమ్మవే…నీకు పొంగళ్ళు నే
సేతు, బోనాలు నే ఇత్తు,మొక్కులన్
దీర్తునే, కోర్కెలన్ దీర్పవే.. దయామూర్తివే, మమ్ములన్ గావవే !
సోనియా మాయ
మటుమాయగా చేయవే,మన్మోహనున్
మనసునున్ మార్చవే, కేసియారున్
నిరోధించవే, కేటియార్ నోరు
మూయించవే, ఈటెలకు నోరు
కుట్టేయవే, కోదండరామున్
కట్టిపడవెయ్యవే, తోక పార్టీలకున్
తెలివితేటల్ ప్రసాదింపవే, ఉస్మానియా మానియా
లోకమున్ మార్చవే... కళ్ళు తెరిపించవే, సమైక్యాంధ్ర
మంత్రమ్ము బోధించవే...సదా నిన్ను స్మరియింతు, సదా పూజలున్ చేతునే...మొరాలింపవే...నమస్తే
ఆంధ్ర మాతా..నమస్తే..నమస్తే నమః !
11-09-2013 ...శనగల