సాగులో కష్టాలు - వ్యవసాయ వార్తలు - కవిత్వం - సంగీతం

ఇది ఒక వ్యవసాయ అధికారి బ్లాగు. అందరు బ్లాగ్ చేయొచ్చు.

Saturday, October 13, 2012


Thursday, October 11, 2012

Wednesday, October 10, 2012


జీఎం విత్తనం.. అశాస్త్రీయం
డీడీఎస్ మీడియా భేటీలో కేరళ
జీవ వైవిద్య బోర్డు మాజీ చైర్మన్ విజయన్

హైదరాబాద్, అక్టోబర్ 9 : ఆహార పంటల్లో జన్యుమార్పిడి పూర్తిగా అశాస్త్రీయమని కేరళ బయోడైవర్సిటీ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ వీఎస్ విజయన్ అభిప్రాయపడ్డారు. బీటీ సాగు కంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని, పెట్టుబడి కూడా దాని కంటే తక్కువని ఆయన పేర్కొన్నారు. పంటలను నాశనం చేసే పురుగులను నియంత్రించేందుకే బీటీ సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. జీఎం పంటలపై డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయన్ పాల్గొన్నారు. 


ఆయనతోపాటు.. వనగం ఫౌండేషన్ చైర్మన్ నమ్మాళ్వార్, డీడీఎస్ డైరెక్టర్ సతీష్, రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు గ్రహీత ఫ్రాన్సిస్ మూర్, బెనిన్ దేశానికి చెందిన రానే సేజ్‌బూ, జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ ఇస్లే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 75 శాతం బీటీ పంటలు వేసి నష్టపోయినవారేనని విజయన్ అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఆహార పంటల్లో విడుదల చేయడానికి 72 రకాల జీఎం విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసుకుని ఉన్నాయన్నారు. 



జీఎం పంటల పుప్పొడి.. తేనెటీగలు, తుమ్మెదలు, గాలి ద్వారా నాన్ జీఎం పువ్వులపై పడితే సంకరం జరిగి జీవ వైవిధ్యానికి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జన్యుమార్పిడి చేసిన ఆహార పంటల క్షేత్ర ప్రయోగాలను సైతం అనుమతించకూడదన్నారు. బీటీ పంటలతో భారత ఆహార సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ముప్పు పొంచి ఉందని డీడీఎస్ డైరెక్టర్ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత తృణధాన్య పంటల సాగును బీటీ పత్తి తగ్గించి వేస్తోందని నమ్మాళ్వార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. దేశంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరగడం వెనుక విదేశీ కంపెనీల హస్తం ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.

Tuesday, October 9, 2012




                                           
                                              









భలే  మ౦చి  ఉగాది ....
తీపి  పులుపు  చేదిది ...     // భలే //
శడ్రుచులు  చేరినది ...
న౦దనమీ  ఉగాది ...         // భలే //
తెలుగు  జాతి  వేదమిది ...
తెలుగువాడి  సారమది...
తెలుగునాట  నాదమది...
తెలుగు  భాస  సప్తపది...   // భలే //
పల్లె బతుకు పునాది ...
పాడి ...ప౦టల  సవ్వడి ...
స౦బరాల  కాలమిది ...
శుభ౦  పలుకు  ఉగాది .. . // భలే //
వ్యవసాయక  దేశమిది ...
రెతుబాట  మనవిధి ....
పల్లెనిద్ర  ప్రగతిపది ...
పాడిప౦ట  సమ్రుద్ధి...  // భలే //
This song was written on the occasion of Ugadi festival of 2012. The Telugu software i have i.e., Baraha did not support to write SHA in Telugu or i could not correctly find the keys, so in the line numbers 3 and 8 i could not use proper letters. Similarly in the 14th line RY could not be written. Veiwers please make a note.