సాగులో కష్టాలు - వ్యవసాయ వార్తలు - కవిత్వం - సంగీతం

ఇది ఒక వ్యవసాయ అధికారి బ్లాగు. అందరు బ్లాగ్ చేయొచ్చు.

Tuesday, September 17, 2013

ఆంధ్రమాతా దండకం
         శ్రీ ఆంధ్ర మాతా, నమో ఆంధ్ర మాతా, నమో తెలుగుతల్లి, తెలుగు తేజంబు నలుదిశల చాటించినావే, కీర్తి ఖంఢాంతరాన ప్రకాశింపగా చేసినావే, భాషా ప్రయుక్త రాష్ట్రంబుగా ఎదిగిఅంధ్రన్, తెలంగానన్ సీమ ప్రాంతంబులన్ సమదృష్టిగా జూచినావే, దయాశీలివే, ధర్మమున్ నాల్గు పాదాల నడిపించినావే, అన్ని జిల్లాల  అభివృద్ధి గావించినావే, నీ కీర్తినేనెంచ నేనెంతవాడన్, కరుణించి కాపాడవే తల్లిబాధలన్ దీర్పవే, బందులన్ ఆపవే, నీ భజన నే సేతునే… విభజనల్ ఆపవే, సమైక్యంబుగా రాష్ట్రమున్ నిలపవే, ఓ భారతీ పుత్రి, సదా నీవె సమవర్తి, తెలంగాన నేతలకు సద్భుద్ధి ప్రసాదింపవె, మనసులన్ మార్చవె, మనుషులన్ జేయవె, కలసివుంటేనె కలదు సుఖంబను నీతి బోధింపవె, సద్భుద్ది కలిగించవె,కనక దుర్గమ్మవె, కాళికామాతవే, మహంకాళివే, మారి మరిడెమ్మవేనీకు పొంగళ్ళు నే సేతు, బోనాలు నే ఇత్తు,మొక్కులన్ దీర్తునే, కోర్కెలన్ దీర్పవే.. దయామూర్తివే, మమ్ములన్ గావవే !
సోనియా మాయ మటుమాయగా చేయవే,మన్మోహనున్ మనసునున్ మార్చవే, కేసియారున్ నిరోధించవే, కేటియార్ నోరు మూయించవే, ఈటెలకు నోరు కుట్టేయవే, కోదండరామున్ కట్టిపడవెయ్యవే, తోక పార్టీలకున్ తెలివితేటల్  ప్రసాదింపవే, ఉస్మానియా మానియా లోకమున్ మార్చవే... కళ్ళు తెరిపించవే, సమైక్యాంధ్ర మంత్రమ్ము బోధించవే...సదా నిన్ను స్మరియింతు, సదా పూజలున్ చేతునే...మొరాలింపవే...నమస్తే ఆంధ్ర మాతా..నమస్తే..నమస్తే నమః ! 
11-09-2013                                                                                          ...శనగల
   
తెలంగాణ లొల్లిపాట
ఇటలీ తిరగేసి చూడు
విభజన మంత్రం పాడు
బ్రిటీషోడి నీతి సూక్తి
సోనియాకు అనురక్తి !
తమిళ తంబి పుల్లబెట్టె
తెళంగాణ వెర్రిపుట్టె
కేసిఆర్ నిప్పుపెట్టె
సెంటర్లో వణుకు పుట్టె !
ఆంధ్రను విడతీయబోతె
ఎన్నికల్లొ అధోగతె
డిపాజిట్లు దక్కవంట
సచివులు మాజీలంట !
బి.జె.పి. వోట్ల వేట
టి.ఆర్.ఎస్. లొల్లిపాట
టి.డి.పి.(కల్ల) బొల్లిమాట
కాంగ్రెస్సుది అమ్మబాట!



(కో)దండ(గ)రాముని కంపెనీ
కదిలిస్తే కంపని
అడుసులొ అడుగేస్తినని
ప్రక్షాలన తప్పదనీ 
అమ్మకు చెవిలో చెప్పర డిగ్గీరాజన్న!
తెలంగాణ తమ్ముడా
తెలుగుతల్లి బిడ్డడా
విడిపోతె పరాజయం
కలిసుంటె మన విజయం !
రాజకీయమా అవకాశవాదమా
ప్రజలకోసమా పదవికోసమా
తెలంగాణమా సమైక్యవాదమా
మసలుకొనుము తెలివిగా
మేలుకొనుమ మిత్రమా!
                                                       ­­..… శనగల