సాగులో కష్టాలు - వ్యవసాయ వార్తలు - కవిత్వం - సంగీతం

ఇది ఒక వ్యవసాయ అధికారి బ్లాగు. అందరు బ్లాగ్ చేయొచ్చు.

Friday, November 1, 2013

దీపావళి శుభాకాంక్షలతో ...


దీపావళి శుభాకాంక్షలతో ...
నరకుని గర్వము నణచగ
నరవరుని సతి సత్యభామ నతిశయమ్ముగా
సరసర దునుమాడె ఖలున్
సరళిగ రవ్వలు చిందగ శరఘాతముతో !
పెద్దలు పిన్నలు గూడిరి
సద్దులు జేయుచు గాల్చిరి సరముల వడిగా !
హద్దులెరుగనా(నందము
కద్దను వారెవరు యిలను, కానగ గలరా !
 దివిన వెలిగె దివ్వెలు
నవి కాంతులు నింపెనవని నతిశోభనమున్ !
రవి చంద్రులు కూడినట్లు
భువిని దివాళి జరిపిరి బుధులు ప్రీతిగాన్ !

01-11-2013                                                      ...శనగల

3 comments:

  1. రామమోహన్ గారూ,
    వ్యవసాయరంగంలో ఉండి సాహిత్యంపట్ల అందులోనూ పద్యకవిత్వం పట్ల ఆసక్తి చూపుతూ దీపావళిని గురించి మీరు వ్రాసిన పద్యాలు బాగున్నవి. అభినందనలు. కొన్ని చిన్నచిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటే మీరు త్వరలోనే మంచి పద్యకవులవుతారు.
    మొదటి పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘సత్యభామ + అతిశయమ్ముగా’ అన్నప్పుడు యడాగమం వచ్చి ‘సత్యభామ యతిశయమ్ముగా’ అనవలసి ఉంటుంది. అలా అన్నప్పుడు గణదోషంతో పాటు యతిదోషం కూడా. ఆ పాదాన్ని ‘నరవరు సతి సత్యభామ నయరీతి దగన్’ అనండి. నాల్గవ పాదంలో ‘చిందగ’ అని భగణాన్ని వేశారు. అక్కడ నలము కాని, జగణము కాని ఉండాలి కదా! అందువల్ల దానిని ‘రవ్వలు చెదరగ’ అనండి.
    రెండవ పద్యంలో ‘వారెవరు + ఇలను’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వారెవ్వ రిలను’ అంటే సరి!
    మూడవ పద్యం మొదటిపాదంలో గణదోషం. ‘దివిలో వెలిగెను దివ్వెలు’ అనండి. మూడవ పాదంలో ‘కూడినట్లు’ అన్నచోట గణదోషం. ‘కూడినటుల’ అంటే సరి.
    దయచేసి ఒకసారి నా బ్లాగు ‘శంకరాభరణం’ను దర్శించండి.
    http://kandishankaraiah.blogspot.in

    ReplyDelete
  2. నేను గమనించలేదు. మూడవ పద్యం నాలుగవ పాదంలోనూ గణదోషం. ‘దివాళి’ అనడం దోషమే. ఆ పాదాన్ని ‘భువి దీపావళి జరిపిరి బుధు లలరంగన్’ అనండి.

    ReplyDelete
  3. Thank you sir for your corrections. I need more & more comments & suggestions from the elders like you. I studies telugu in my intermediate and afterwards, it was not a subject for me. But, out of my interest I am attempting to write poetry. So I need your blessings. Thanks Once again.

    ReplyDelete